‘పేట’ తెలుగు ట్రైలర్.. రజిని స్టైల్ అదుర్స్..!

-

సూపర్ స్టార్ రజినికాంత్, కార్తిక్ సుబ్బరాజు కాంబినేషన్ లో వస్తున్న సినిమా పేట. న్యూ ఇయర్ గిఫ్ట్ గా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. కబాలి, కాలా, 2.ఓ సినిమాల్లో రజిని స్టైల్ కు మించి పేట సినిమాలో రజిని అదరగొట్టాడని చెప్పొచ్చు. పేట తెలుగు ట్రైలర్ రజిని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యేలా చేసింది. చాలా సింపుల్ గా తన స్టైల్ తో ఆకట్టుకున్నాడు రజినికాంత్. ఇక ముఖ్యంగా తనదైన స్టైల్ లో డైలాగ్స్ చెప్పే రజిని పేట సినిమాలో అలా కూడా ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చేలా ఉన్నాడు.

సన్ పిక్చర్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాను కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. సినిమాలో సిమ్రాన్, త్రిష హీరోయిన్స్ గా నటిస్తుండగా విజయ్ సేతుపతి, నవాజుద్ధీన్ సిద్ధికి కూడా నటిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న వస్తుంది. తెలుగు వర్షన్ రిలీజ్ పై అనుమానాలు ఉండగా ఈ ట్రైలర్ తో తెలుగులో కూడా ఆరోజు రావడం కన్ ఫాం అని అంటున్నారు. రజిని మార్క్ స్టైల్ తో వచ్చిన పేట ట్రైలర్ ఆకట్టుకోగా సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news