జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటికి గుండెపోటు?

-

జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న చలాకీ చంటి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎక్కువగా తన పంచ్ డైలాగ్లతో కామెడీ స్కిట్లతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా సినిమాలలో కూడా కమెడియన్ గా రాణించారు.

అయితే, ఈ జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటికి గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాదులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. పరిస్థితి సీరియస్ గా ఉండటంతో ఐసీయూలో చేర్చినట్లు వార్తలు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఆయన అటు సినిమాలు, ఇటు బుల్లితెర షోలలో కనిపించడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news