వెల్లుల్లి పొట్టు వలన ఎన్ని ఉపయోగాలో తెలిస్తే అవాక్ అవుతారు..!

-

వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అందుకని వెల్లుల్లిని చాలా మంది వంటల్లో వాడుతూ ఉంటారు. అయితే వెల్లుల్లి వల్ల కలిగే లాభాల గురించి మీకు తెలుసు. కానీ వెల్లుల్లి పొట్టు వల్ల కూడా ఎన్నో లాభాలను పొందవచ్చు. వెల్లుల్లి పొట్టు వలన చక్కటి ప్రయోజనాలను పొందచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. యాంటీ ఫంగల్ గుణాలు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇందులో ఉంటాయి. వెల్లుల్లి పొట్టుతో చక్కటి ప్రయోజనాలని పొందొచ్చు.

 

వెల్లుల్లి పొట్టు ని మనం కూరల్లో సూప్స్ లో వేసుకోవచ్చు ఇందులో యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి కాబట్టి చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. వెల్లుల్లిపొట్టు వలన దురద వంటి సమస్యలు రావు. వెల్లుల్లి పొట్టు లో నీళ్లు కలిపి దానిని దురదలు ఉన్నచోట రాస్తే సమస్య నుండి బయట పడడానికి అవుతుంది. పింపుల్స్ నుండి కూడా ఇది బయటపడిస్తుంది. జుట్టుకు కూడా వెల్లుల్లి పొట్టు ఎంతో మేలు చేస్తుంది.

వెల్లుల్లి పొట్టు పేస్ట్ లో కొంచెం నీళ్లు కలిపి దానిని జుట్టుకి పట్టిస్తే చుండ్రు పేలు సమస్య నుండి బయట పడచ్చు. చాలామంది చుండ్రు, పేలు తో బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఈ చిట్కాని ట్రై చేయొచ్చు లేదంటే మీరు వెల్లుల్లి పొట్టులో నీళ్లు కలిపి ఆ నీటిని మరిగించి జుట్టుకి అప్లై చేసుకుంటే చాలా మేలు కలుగుతుంది. ఆస్తమా సమస్యతో బాధపడే వాళ్ళకి కూడా వెల్లుల్లిపొట్టు బాగా పనిచేస్తుంది. ఉదయం సాయంత్రం వెల్లుల్లి పొట్ట లో తేనె వేసుకుని తీసుకుంటే ఆస్తమా నుండి బయటపడొచ్చు. కాళ్ల వాపుల నుండి కూడా ఇది బయటపడేస్తుంది ఇలా ఇన్ని లాభాలని వెల్లుల్లి పొట్టు ద్వారా పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news