అలాంటి వాడే భర్తగా రావాలంటున్న జబర్దస్త్ ఫైమా..!

-

ఒకప్పుడు యూట్యూబ్లో కొన్ని వీడియోలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఫైమా ఆ తర్వాత పటాస్ షో ద్వారా మరింత పాపులారిటీ దక్కించుకుంది. ఎప్పుడైతే జబర్దస్త్ లోకి అడుగుపెట్టిందో ఈ ఆ తర్వాత ఆమె వెనుతిరిగి చూసుకోలేదని చెప్పాలి. ప్రస్తుతం భాస్కర్ టీంలో కొనసాగుతున్న ఈమె ఇటీవలే బిగ్ బాస్ లోకి కూడా వెళ్లి టాప్ ఫైవ్ లో ఒకరిగా నిలిచింది. అక్కడ కూడా తన పెర్ఫార్మెన్స్ తో అందరిని ఆకట్టుకుంది ఫైమా. ఇకపోతే బిగ్ బాస్ ద్వారా ఆర్థికంగా లాభపడ్డమే కాదు తెలుగు ప్రేక్షకులకు కూడా మరింత దగ్గరయ్యింది. అయితే ఆ తర్వాత మాత్రం జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైందనే చెప్పాలి. ప్రస్తుతం స్టార్ మా చానల్లో ప్రసారమయ్యే పలు షోలలో సందడి చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

ఇదిలా ఉండగా ఇటీవల స్టార్ మా పరివార్ కార్యక్రమంలో పాల్గొన్న ఫైమా తనకు కాబోయే వాడు ఎలా ఉండాలి? అతనికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? అనే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆదివారం విత్ స్టార్ మా పరివార్ అనే షోకి ముక్కు అవినాష్, శ్రీముఖి తో పాటు ఫైమా కూడా హోస్ట్గా నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే స్టేజ్ పైన తనకు ఎలాంటి వాడు కావాలో వెల్లడించింది. తనకు కాబోయే వాడు తనను ఎంతో కేరింగ్గా చూసుకోవాలని.. ఏకంగా చిన్నపిల్ల లాగా చూసుకోవాలి అంటూ చెప్పుకొచ్చింది.

అంతేకాదు ప్రతి విషయంలో కూడా తనకు సపోర్ట్ చేయాలి అని.. మంచివాడు అయివుండాలని తెలిపింది. ఫైమా. ఇకపోతే పటాస్ ప్రవీణ్ తో ఈమె ప్రేమలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఎన్నో రోజులపాటు వీరిద్దరి జోడి జబర్దస్త్ స్టేజ్ పైన తెగ సందడి చేసింది. కానీ ఇప్పుడు జబర్దస్త్ కి దూరం కావడంతో వారి కెరియర్ లో ఎవరికి వారు బిజీగా ఉన్నారు. ఎక్కడ కూడా కలిసి కనిపించడం లేదు. మరోవైపు అతి తక్కువ సమయంలోనే జబర్దస్త్ షోలోకి రీఎంట్రీ ఇస్తానని ఫైమా చెప్పింది. మరి ఇది ఎప్పుడు జరుగుతుందో ప్రవీణ్, ఫైమా ఎప్పుడు కలుసుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news