ఆధార్‌ కార్డ్‌లో ఫోటో అప్‌డేట్ చేసుకోవాలా..? అయితే ఇదే ఈజీ ప్రాసెస్..!

-

మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు కూడా ఒకటి. ఆధార్ కార్డు ఎన్నో వాటికి అవసరం అవుతుంది. ఎన్నో పనులకు ఇది ఐడీ ఫ్రూఫ్‌లా పని చేస్తోంది. మొబైల్ సిమ్ కొనుగోలు నుంచి ప్రభుత్వ పథకాల దాకా ఆధార్ అవసరం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్యతో కూడిన ఆధార్‌ను జారీ చేస్తుంది. ఈ నంబర్‌తో కార్డ్ ‌హోల్డర్ డెమోగ్రాఫిక్ (అడ్రస్), బయోమెట్రిక్ డేటా( వేలిముద్రలు, ఐరిస్) వివరాలు లింక్ అవుతాయి. ప్రభుత్వం ఇస్తున్న ప్రయోజనాలను పొందాలంటే పక్కా ఆధార్ కార్డు ఉండాలి.

పేరు, అడ్రస్, పుట్టిన తేదీ, జెండర్, మొబైల్ నంబర్ వంటి వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు. అలానే ఫింగర్ ఫ్రింట్స్, ఐరిష్, ఫోటో వంటి వాటిని కూడా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆధార్ డెమోగ్రాఫిక్ అప్‌డేట్స్ రెండు మార్గాల్లో చేసుకోవచ్చు. మీకు దగ్గర లోని ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు వెళ్లి ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. లేకపోతె myAadhaar యాప్‌ లో అయినా చేసుకోవచ్చు.

ముందు UIDAI అధికారిక వైబ్‌సైట్ uidai.gov.in లోకి వెళ్ళాలి. ఇందులో అప్‌డేట్ ఆధార్ అనే ఆప్షన్‌పై క్లిక్ చెయ్యండి. కొత్త పేజీలో ఒక ఫారమ్ ఓపెన్ అవుతుంది. డౌన్‌లోడ్ చేయాలి. అవసరమైన వివరాలతో ఈ ఫారమ్ ని నింపండి. సమీపంలోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌లో సబ్మిట్ చేసుకోండి. ఎగ్జిక్యూటివ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ ద్వారా మీ వివరాలను చూస్తారు. ఆధార్‌కార్డ్‌లో అప్‌డేట్ అవ్వడానికి కొత్త ఫోటో ని తీస్తారు. దీని కోసం రూ.100 ఫీజు + జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్ ఎగ్జిక్యూటివ్ మీకు రసీదు స్లిప్, అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ ని ఇస్తారు. ప్రాసెస్ పూర్తయిన 90 రోజుల్లో అన్ని వివరాలు ఆధార్‌లో అప్‌డేట్ అవుతాయి.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news