ముంబై లోకల్ ట్రెయిన్స్.. ముంబై మహా నగరంలో దాదాపు 80 లక్షల మంది ఈ లోకల్ ట్రెయిన్స్ లో ప్రతి రోజు ప్రయాణిస్తుంటారు. ముంబైకి ఉన్న ప్లస్ పాయింటే లోకల్ ట్రెయిన్స్. ముంబై, థానె, కల్యాణ్, నవీ ముంబై లాంటి అన్ని ప్రాంతాలకు లోకల్ ట్రెయిన్ల సౌకర్యం ఉంది. అందుకే ఎక్కవ శాతం మంది లోకల్ గాడీల్లో ప్రయాణించడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే.. లోకల్ ట్రెయిన్ల వల్ల ముంబైలో చాలా ప్రమాదాలే జరుగుతుంటాయి. కొన్నిసార్లు అనుకోకుండా ప్రమాదాలు జరిగితే.. మరికొన్ని ప్రమాదాలు ఆకతాయిల వల్ల జరుగుతుంటాయి. కొంతమంది కుర్రాళ్లు, ఆకతాయిలు ట్రెయిన్లలో రకరకాల విన్యాసాలు చేస్తూ ప్రాణాలు కోల్పోవడం మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. అయితే.. వాళ్లంతా యువకులు.. కానీ రీసెంట్ గా వైరల్ అయిన ఓ వీడియోను చూస్తే మీరు షాక్ అవ్వాల్సిందే.
ఓ యువతి… లోకల్ ట్రెయిన్ లో రకరకాల స్టంట్లు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. హార్బర్ లైన్ లో వెళ్తున్న ఓ ట్రెయిన్ లో యువతి విన్యాసాలు చేసింది. ఆ యువతి స్టంట్స్ చేస్తుండగా తోటి ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫుట్ బోర్డ్ మీద నిలబడి ఆ యువతి చేసిన విన్యాసాలు చూసిన నెటిజన్లు ఔరా అంటున్నారు. ఆ యువతి సరదాగా చేసిందో.. లేక దేనికోసం చేసిందో తెలియదు కాని.. ఇప్పుడు పోలీసులు ఆ యువతిని కనిపెట్టే పనిలో పడ్డారు.