తలైవాకు డబుల్ ధమాకా.. BMW కారుతో పాటు జైలర్ లాభాల్లో కొంత ఇచ్చిన నిర్మాత

-

‘జైలర్‌’ మూవీ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉంది ఆ చిత్రబృందం. ముఖ్యంగా ఆ సినిమా కలెక్షన్లతో నిర్మాత కళానిధి మారన్ సంబురాలు చేసుకుంటున్నారు. ఈ సంబురంతో పాటు సినిమాకు వచ్చిన లాభాలు కూడా ఆయన షేర్ చేసుకునే పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే కళానిధి మారన్ ఆ సినిమా హీరో తలైవా రజనీ కాంత్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు.

గురువారం సాయంత్రం రజనీని ప్రత్యేకంగా కలిశారు. చిత్రానికి వచ్చిన లాభాల నుంచి కొంత మొత్తాన్ని చెక్‌ రూపంలో అందించారు. అలాగే, రెండు బీఎండబ్ల్యూ కారులను తీసుకువెళ్లి.. అందులో నచ్చింది సెలెక్ట్‌ చేసుకోవాలని కోరారు. బీఎండబ్ల్యూ ఎక్స్‌7 మోడల్‌ కారును రజనీ సెలెక్ట్‌ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక, ఈ కారు ధర దాదాపు రూ.1.26 కోట్లు ఉంటుందని సమాచారం.

‘రోబో’, ‘పేట’, ‘అన్నాత్తె’ తర్వాత కళానిధి మారన్‌, రజనీకాంత్‌ కలిసి వర్క్‌ చేసిన సినిమా ‘జైలర్‌’. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. ఆగస్టు 10న విడుదలైన ఈ సినిమా అంతటా సూపర్‌హిట్‌ టాక్‌ అందుకుంది. ఇప్పటికే ఈ చిత్రం రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news