భూమి లేని పేదలకు అండగా ఉంటాం : సీఎం జగన్

-

దేశంలో ఎక్కడ లేని విధంగా కౌలు రైతులకు కూడా తోడుగా నిలబడే ప్రభుత్వం తమదేనని సీఎం వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. భూమి లేదని పేదలకు సైతం తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. తాడెపల్లి కార్యాలయంలో కౌలు రైతులకు పెట్టుబడి సాయంగా తొలి విడుత నిధుల జమ కార్యక్రమం జరిగింది. దేవుడి దయతో ఇవాళ రెండు మంచి కార్యక్రమాలకు ఇక్కడి నుంచి శ్రీకారం చుడుతున్నాం. తొలుత కౌలు రౌతుకు సంబంధించి.. వారితో పాటు దేవాదాయ శాఖ భూములు కౌలు చేసుకుంటున్న రైతులకు 2023-24 తొలి విడత పెట్టుబడి సాయం రూ.7,500 అందిస్తున్నట్టు తెలిపారు.

అదేవిధంగా ఖరీఫ్ సీజన్ లో భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు సబ్సీడీగా ఆ సీజన్ లో జరిగిన నష్టాన్ని.. ఆ సీజన్ ముగిసే లోపు పరిహారాన్ని రైతన్నల చేతులో పెడుతున్నామని తెలిపారు సీఎం జగన్. దేశంలో ఎక్కడా లేని విధంగా కౌలు రైతులకు కూడా తోడుగా నిలబడే ప్రభుత్వం బహుశా ఎక్కడా లేదేమోజ. ఏ వ్యవసాయం భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీలు ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వం అండగా నిలబడుతుందని స్పష్టం చేశారు సీఎం జగన్.

 

Read more RELATED
Recommended to you

Latest news