అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్.. నిజ జీవిత పాత్రలని తీసుకుని ఎవ్వరికీ తెలియని కథని ఊహించి ఆర్ ఆర్ ఆర్ అని తెరకెక్కిస్తున్న రాజమౌళి, తన సినిమాలో ప్రేక్షకుడు ఊహించని సన్నివేశాల్ని తెరమీదకు తీసుకువస్తున్నాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ టీజర్ల ద్వారా ఎన్నో ప్రశ్నల్ని లేవనెత్తిన రాజమౌళి, తాజాగా మరో ఎపిసోడ్ ని తన సినిమాలోకి తీసుకువస్తున్నారని సమాచారం. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో దేశభక్తికి సంబంధించిన కథాంశం కంటే స్నేహం గురించే ఎక్కువగా చూపిస్తానని రాజమౌళి చెప్పాడు.
కానీ ఇద్దరు స్వాతంత్ర్య సమర యోధుల పాత్రలని తీసుకుని దేశభక్తికి సంబంధించిన సీన్లు ఉండకపోతే ఎలా..? అందుకే ఆర్ ఆర్ ఆర్ లో జలియన్ వాలా బాగ్ ఎపిసోడ్ ఉంటుందని వినబడుతుంది. 1919లో జరిగిన ఈ ఉదంతంలో వెయ్యిమందికి పైగా మరణించారు. జనరల్ డయ్యర్ రాక్షసత్వానికి నిలువెత్తు నిదర్శనంలా నిలిచిందీ సంఘటన. అలాంటి సంఘటన ఆర్ ఆర్ ఆర్ లో చూడబోతున్నామట. సినిమా కథ 1920లో జరుగుతుందని కన్ఫర్మ్ చేసాడు కాబట్టి జలియన్ వాలా బాగ్ ఉదంతం ఉండటం నిజమేనేమో అనిపిస్తుంది.