ప్రస్తుతం దక్షిణాది సినిమా దేశ పరిధులు దాటి.. అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ ప్రేక్షకులు కూడా తెలుగు సినిమాకు ఫిదా అవుతున్నారు. ఇక్కడి హీరోలకు.. పాటలపై మనసు పడుతున్నారు. ముఖ్యంగా జపాన్ ప్రేక్షకులకు తెలుగు సినిమాలంటే పిచ్చి. దక్షిణాదిన ఏ పాట హిట్ అయినా.. అక్కడి ఫ్యాన్స్.. యూట్యూబర్స్ ఆ పాటలకు స్టెప్పులు వేసి నెట్టింట వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు.
తాజాగా రజనీకాంత్ ‘జైలర్’. ఈ చిత్రంలోని ‘‘వా.. నువ్వు కావాలయ్యా.. నువ్వు కావాలి’’ పాటకు కూడా జపాన్ యువత స్టెప్పులేస్తోంది. అయితే ఈసారి కాస్త వెరైటీగా.. ఈ పాటకు భారత్‌లోని జపాన్ రాయబారి హిరోషి సుజుకి డ్యాన్స్ వేశారు. ప్రముఖ యూట్యూబర్ మాయో సాన్‌తో కలిసి ఆయన ఈ పాటకు డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది. రజనీకాంత్‌పై తన ప్రేమ కొనసాగుతూనే ఉంటుందని ఆయన తెలిపారు.
Kaavaalaa dance video with Japanese YouTuber Mayo san(@MayoLoveIndia)🇮🇳🤝🇯🇵
My Love for Rajinikanth continues … @Rajinikanth #Jailer #rajinifansVideo courtesy : Japanese Youtuber Mayo san and her team pic.twitter.com/qNTUWrq9Ig
— Hiroshi Suzuki, Ambassador of Japan (@HiroSuzukiAmbJP) August 16, 2023