అతడే నా పార్టనర్ అంటున్న జయమ్మ.. హాట్ ట్వీట్ వైరల్..!!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో వరలక్ష్మీ శరత్ కుమార్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఈ ముద్దుగుమ్మ సీనియర్ నటుడు శరత్ కుమార్ కూతురుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదట హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ అంతగా సక్సెస్ కాలేక పోయింది కానీ ఆ తరువాత విశాల్ సినిమాలో విలన్ పాత్రలో అద్భుతంగా నటించి మంచి విజయాన్ని అందుకుంది వరలక్ష్మి. ఇక తర్వాత ఎక్కువగా విలన్ పాత్రలోనే నటిస్తూ మెప్పిస్తూ ఉండేది. ఇక అలా విజయ్ తో సర్కార్ చిత్రంతో వరలక్ష్మి శరత్ కుమార్ మరొకసారి విలన్ గా కనిపించడంతో ఈ సినిమా ఈమెకు మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది.ఇక ఆ తర్వాత తెలుగు, తమిళ వంటి భాషలలో కూడా పలు అవకాశాలు రావడంతో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. తెలుగులో క్రాక్, నాంది, పక్కా కమర్షియల్ సినిమాలలో నటించి మంచి విజయాన్ని అందుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. ఇప్పుడు తాజాగా సమంత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న యశోద చిత్రంలో ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది వరలక్ష్మి. ఇక ఇవే కాకుండా శబరి, వర ఐపీఎస్ వంటి తదితర సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నది. ఈమె ఎక్కువగా కంటెంట్ ఉన్న పాత్రలని ఎంపిక చేసుకుంటూ ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా తన ట్విట్టర్ నుంచి ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేయడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.Varalaxmi Sarathkumar Age | Height | Boyfriend | Family | Wiki | Biographyఅదేమిటంటే ఒక నటుడిని పార్టనర్ అంటూ సంబోధిస్తూ చేసిన ఒక ట్వీట్ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారుతోంది.. అది కూడా కోలీవుడ్ యాక్టర్ ప్రసన్నను పార్ట్నర్ అంటూ ట్వీట్ చేయడం జరిగింది . ఇక ఈ ట్వీట్ లో హ్యాపీ బర్తడే పార్టనర్ ప్రసన్న.. హ్యావ్ ఏ బ్లాస్ట్ కీప్ రాకింగ్ అని రాసుకొచ్చింది.. ఇక ప్రసన్నతో దిగిన ఒక ఫోటోను కూడా యాడ్ చేస్తూ ట్వీట్ చేయడం అందరిని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక ప్రసన్న మొదట నాగార్జునతో కలిసి భాయ్ చిత్రంలో నటించారు.

Read more RELATED
Recommended to you

Latest news