జియో సినిమా: ఇకపై 2 రూపాయలకే ఓటీటీ సినిమాలు..!

-

ఐపీఎల్ 2023 ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుని కోట్లాదిమందికి చేరువైన జియో యాప్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఇప్పటికే పలు రకాల సినిమాలను అందిస్తున్న జియో ప్రస్తుతం తన సేవలను ఉచితంగా అందించడానికి సిద్ధమయ్యింది. ఇకపోతే రానున్న రోజుల్లో జియో చార్జీలు వసూలు చేయడానికి సిద్ధం అవుతుంది. జియో ఒకవైపు ఐపీఎల్ తోనే మరొకవైపు కొత్తగా తీసుకొచ్చే కంటెంట్ కు డబ్బులు వసూలు చేయబోతోంది.

ఇకపోతే దీనిపై ఇప్పటివరకు జియో ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ కూడా నెట్టింట ఒక స్క్రీన్ షాట్ మరింత వైరల్ అవుతుంది. దీని ప్రకారం జియో వసూల్ చేయబోయే ఛార్జీలు ఇవేనని చర్చ జరుగుతోంది. వీటి ప్రకారం జియో నుంచి మూడు ప్లాన్లు రానున్నట్లు సమాచారం. అందులో డైలీ, గోల్డ్ , ప్లాటినం పేర్లతో ఈ ప్లాన్లు ఉండబోతున్నట్లు వస్తున్న ఒక స్క్రీన్ షాట్ ఆధారంగా తెలుస్తోంది. ఈ ప్లాన్ అసలు ధర రూ.299 కాగా 67 శాతం డిస్కౌంట్తో రూ. 99 కి అందుబాటులోకి రానుంది..

మరోవైపు ఈ ప్లాన్ తో రెండు డివైస్లలో జియోని ఉపయోగించుకోవచ్చు. ఇక జియోలో రానున్న మరో ప్లాన్ తో రోజుకు కేవలం రెండు రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఈ ప్లాన్ అసలు ధర రూ.29 కాగా డిస్కౌంట్ లో భాగంగా రెండు రూపాయలకే అందిస్తోంది. ఒకసారి రెండు రూపాయలు పెట్టి డైలీ ప్యాక్ కొనుగోలు చేస్తే 24 గంటల పాటు యాప్ లోనే కంటెంట్ ను వీక్షించవచ్చు. అంతేకాదు ఒకేసారి రెండు డివైస్ లలో వీక్షించే అవకాశం కూడా ఉంటుంది. ఇక ప్లాటినం విషయానికి వస్తే రూ.1199 ప్యాక్ ను 50% డిస్కౌంట్తో రూ.599కే అందిస్తున్నారు. ఇక ఈ ప్లాన్ లో ఒకేసారి నాలుగు డివైస్లను ఉపయోగించుకోవచ్చు. ఏడాది వ్యాలిడిటీ వచ్చే ఈ ప్యాక్ ద్వారా లైవ్ మినహాయింపు కంటెంట్ ని యాడ్ ఫ్రీగా వీక్షించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news