‘ఆర్ఆర్ఆర్’ నుండి ఎన్టీఆర్, చరణ్ లేటెస్ట్ లుక్స్ వైరల్…..!!

-

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ప్రస్తుతం తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే మూడొంతులు పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా తాజా షెడ్యూల్ ని హైదరాబాద్ లో నిర్వహించారు.

 

ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్, రామ్ చరణ్ సరసన ఆలియా భట్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, కోలీవుడ్ నటుడు సముద్ర ఖని, కమెడియన్ రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి నేడు అటు ఎన్టీఆర్ మరియు, ఇటు రామ్ చరణ్ కు సంబందించిన లేటెస్ట్ లుక్స్ రిలీజ్ అయి, సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. నేటి ఉదయం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎన్టీఆర్ లుక్ ని కొందరు అక్కడి ప్రయాణీకులు ఫోటోలు తీసి తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేయగా,

చరణ్ మాత్రం తానే స్వయంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక పిక్ ని పోస్ట్ చేసారు. ఫోన్ ఫ్లైట్ మోడ్ లో ఉంది, గేమ్స్ ఆడుతున్నాను అంటూ చరణ్ విమానంలో ప్రయాణిస్తున్న ఫోటోని పెట్టారు. సో, దీనిని బట్టి ఈ ఇద్దరు నటులు కూడా ఆర్ఆర్ఆర్ తదుపరి షెడ్యూల్ కోసం విదేశాలకు ఎవరికి వారు బయల్దేరారని, అలానే ప్రస్తుతం బయటకొచ్చిన మాదిరిగా సినిమాలో కూడా వీరిద్దరి లుక్స్ ఉండనున్నాయని పలు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జోరుగా జరుగుతోంది. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను 2020 జులై 30 న ప్రపంచవ్యాప్తమా రిలీజ్ చేయనున్నారు….!!

Read more RELATED
Recommended to you

Exit mobile version