నేడు ఎన్టీఆర్ జయంతి… నివాళులర్పించిన జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్

-

Junior ntr and kalyan ram pay tributes to ntr on his birth anniversary

టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 97వ జయంతి నేడు. ఈసందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. ఇవాళ ఉదయమే జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్.. ఆయన సమాధి వద్దకు చేరుకున్నారు. అనంతరం ఆయన సమాధి వద్ద పూలు చల్లి నివాళులర్పించారు.

మరోవైపు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇవాళ గుంటూరులోని పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో మాజీ మంత్రి నారా లోకేశ్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, టీడీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొననున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news