గుర్రంతో జూనియర్ ఎన్టీఆర్ తంటాలు.. వైరల్ వీడియో

-

గుర్రాన్ని లొంగదీసుకోవడం అంత ఈజీ కాదు. దాన్ని లొంగదీసుకోవాలంటే దాని విద్య తెలిసి ఉండాలి. దాన్ని కంట్రోల్ చేయడం తెలిస్తే చాలు.. గుర్రం మీద హాయిగా ఎంత దూరం అయినా ప్రయాణించవచ్చు. అయితే.. చాలామంది సెలబ్రిటీలు గుర్రపు స్వారీ నేర్చుకుంటారు. షూటింగ్ కోసం కానీ.. వ్యక్తిగతంగా గానీ చాలామంది సెలబ్రిటీలు గుర్రపు స్వారీని నేర్చుకుంటారు.

తాజాగా.. జూనియర్ ఎన్టీఆర్ ఓ గుర్రాన్ని మచ్చిక చేసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జూనియర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి నటిస్తున్న సినిమా అది. రాజమౌళి దర్శకుడు. ఈ సినిమా చారిత్రక నేపథ్యంలో వస్తుండటంతో సినిమా కోసం జూనియర్ గుర్రపు స్వారీ నేర్చుకోవాల్సి వచ్చింది. అందుకే.. షూటింగ్ కోసం జూనియర్ ఓ గుర్రంతో కుస్తీ పట్టాల్సి వచ్చింది. దాన్ని మచ్చిక చేసుకునే సరికి ఆయన తల ప్రాణం తోకకు వచ్చిందట.

Read more RELATED
Recommended to you

Latest news