వృద్ధురాలిగా కాజ‌ల్‌.. ఏ సినిమాలోనూ తెలుసా..?

-

తెలుగు .. తమిళ భాషల్లో అందాల కథానాయికగా కాజల్ కి మంచి క్రేజ్ ఉంది. ఈ చంద‌మామ లాంటి ముద్ద‌గుమ్మ‌కు ఫ్యాన్ ఫాలోంగ్ కూడా ఓ రేంజ్‌లోనే ఉంద‌ని చెప్పాలి. సీనియర్ స్టార్ హీరోల సరసన అవకాశాలతో ఆమె దూసుకుపోతోంది. ఈ నేప‌థ్యంలోనే టాలీవుడ్, అటు కోలీవుడ్, బాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో బిజీగా ఉంది కాజల్ అగర్వాల్. ఇక ప్ర‌స్తుతం శంకర్-కమల హాసన్ కాంబినేషన్‌లో తెరకెక్కిస్తున్న ‘ఇండియన్ 2’ చిత్రంలో కాజల్ అగర్వాల్ న‌టిస్తోంది. అయితే చిత్రంలో తన పాత్ర ఏమిటన్నది నటి కాజల్‌ అగర్వాల్‌ బయట పెట్టేశారు. ఈ సినిమాకు సంబంధించిన ఏ విషయాన్నీ డైరక్టర్ శంకర్‌ బయట పెట్టరాదని కండిషన్‌ పెట్టారని చెబుతూనే తన పాత్ర గురించి స్పష్టంగా చెప్పేశారు.

‘భారతీయుడు’లో సుకన్య చేసిన పాత్ర తరహాలో ఈ సీక్వెల్లో కాజల్ వృద్ధురాలి పాత్రలో కనిపించనుందనే టాక్ వచ్చింది. అయితే అలాంటి పాత్రను కాజల్ అంగీకరించకపోవచ్చని అంతా అనుకున్నారు. కానీ తాజా ఇంటర్వ్యూలో కాజల్ మాట్లాడుతూ, ఈ సినిమాలో తాను వృద్ధురాలి పాత్రలో కనిపించనుండటం నిజమేనని చెప్పింది. “ఈ పాత్రను నేను చేయగలనా .. లేదా అనే సంశయంతో చాలా భయపడ్డాను. కానీ నా మేకప్ చూసి నాకే ఆశ్చర్యం కలిగింది .. నాపై నాకు నమ్మకం పెరిగింది. ఈ పాత్ర నా కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందనే నమ్మకం వుంది” అని చెప్పుకొచ్చింది. మ‌రి ఈ కొత్త త‌ర్హా పాత్ర‌ను ఎంచుకున్న కాజ‌ల్ ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుంతో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news