చందమామ ఫేమ్ కాజల్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి దూసుకుపోవడానికి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఇండియన్ 2 సినిమాలో అవకాశాన్ని దక్కించుకున్న నందమూరి బాలకృష్ణ సినిమాలో హీరోయిన్గా అవకాశం దక్కించుకుంది.
అయితే, తాజాగా తన కెరీర్ పై ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు కాజల్. బిడ్డకు జన్మనిచ్చిన మూడు నెలలకే ఎందుకు నటిస్తున్నావు అంటూ అందరూ తనను అడుగుతున్నారని హీరోయిన్ కాజల్ అగర్వాల్ తెలిపారు. నటనపై ఉన్న ఇష్టంతోనే తొందరగా రీఎంట్రీ ఇచ్చానని చెప్పారు. తాను ప్రధాన పాత్రలో నటించిన ఘోస్టీ చిత్రం ఈనెల 17న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, “నా కుమారుడిని నా తల్లి చూసుకుంటారు. అందుకే నేను కెమెరా ముందు ఎలాంటి టెన్షన్ లేకుండా నటించగలుగుతున్నాను” అని పేర్కొన్నారు.