రూ.1000 కోట్ల క్ల‌బ్‌లో ‘క‌ల్కి’.. క‌ర్ణుడి గెట‌ప్‌లో ప్ర‌భాస్ స్పెష‌ల్ పోస్ట‌ర్ రిలీజ్‌

-

పాన్ ఇండియా న‌టుడు ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన తాజా బ్లాక్ బ‌స్ట‌ర్ ‘కల్కి2898’ బాక్సాఫీస్ వద్ద త‌న జైత్రయాత్రను ఇంకా కొనసాగిస్తుంది. తాజాగా ఈ చిత్రం రూ.1000 కోట్ల క్ల‌బ్‌లో ఎంట‌ర్ అయిన‌ట్లు చిత్రబృందం ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా మూవీ నుంచి క‌ర్ణుడి గెట‌ప్‌లో ఉన్న‌ ప్ర‌భాస్ స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.

ఈ సినిమా కేవ‌లం 17 రోజుల్లోనే రూ.1000 కోట్ల మార్క్ టచ్ చేసినట్లు చిత్రబృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. దీంతో తెలుగు ఇండ‌స్ట్రీలో రూ.1000 కోట్లకు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టిన చిత్రాల‌లో క‌ల్కి మూడ‌వ సినిమాగా నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ పేరిటా ఉన్నాయి. యూనివ‌ర్శ‌ల్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం ప్రేక్ష‌కులు కొత్త అనుభూతిని పంచుతుంది. చాలా కాలం త‌రువాత థియేట‌ర్లు ప్రేక్ష‌కుల‌తో క‌ళ క‌ళ‌లాడుతున్నాయి. గ‌త కొంత‌కాలంగా సినిమాలు లేక‌, స‌రైన కంటెంట్‌తో సినిమాలు రాక విసిగిపోయిన ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమా కొత్త అనుభూతితో పాటు మంచి సినిమా చూశామ‌న్న ఆనందాన్ని ఇచ్చింది. అందుకే ప్రేక్ష‌కులు ఈ చిత్రానికి అత్యంత భారీ విజ‌యాన్ని అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news