కళ్యాణ్ రామ్ “బింబిసార” ట్రైలర్ రిలీజ్.. ఇక్కడ రాక్షసుడైన భగవంతుడైనా ఈ బింబిసారుడు ఒక్కడే

-

నందమూరి కళ్యాణ్‌ రామ్.. మంచి మాస్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరో. హిట్‌ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ… దూసుకుపోతున్నాడు నందమూరి కళ్యాణ్‌ రామ్. హీరోగానే కాకుండా… ఓ నిర్మాతగా బాగా సక్సెస్‌ అయ్యారు కళ్యాణ్‌ రామ్‌. అయితే… ప్రస్తుతం టైమ్ ట్రావెల్ సోషియో ఫాంటసీ డ్రామాగా ”బింబిసార” అనే సినిమా తెర‌కెక్కిస్తున్నారు కళ్యాణ్ రామ్. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై హరికృష్ణ నిర్మిస్తున్నాడు.

పుణ్యభూమిలో ఓ అటవిక రాజు కథే ఈ సినిమా. ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ సరసన కాథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ నటిస్తున్నారు. ఈ సినిమాకు శ్రీ వశిష్ఠ్ దర్శకత్వం వహిస్తున్నారు.అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్‌ డేట్‌ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం.ఇక్కడ రాక్షసుడైన భగవంతుడైనా ఈ బింబిసారుడు ఒక్కడే అంటూ భారీ డైలాగులతో మెప్పించారు.కాగా ఈ సినిమా ఆగస్టు 5న రిలీజ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news