కళ్యాణ్ రామ్ “డెవిల్” మూవీ షూటింగ్ కంప్లీట్..!

-

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం డెవిల్. ఈ చిత్రానికి నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తుండగా.. సంయుక్త మీనన్ ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం స్పై థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించనున్నాడు. ఈ మూవీని ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా ప్రొడ్యూస్ చేస్తుండగా.. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

తాజాగా ఈ మూవీ సక్సెస్ ఫుల్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయిన ఈ మూవీ సెట్స్ నుంచి హీరో, హీరోయిన్, నిర్మాత అభిషేక్ నామా కలిసి దిగిన లేటెస్ట్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే వెల్లడించనుంది చిత్ర బృందం. ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ కూడా పాన్ ఇండియా హీరో అవ్వడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version