దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో తలైవి టైటిల్‌తో అమ్మ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు ఏఎల్.విజయ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ బయోపిక్ లో జయలలిత అమ్మ పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ నటిస్తోంది. ఈ సినిమాలో కీలకమైన ఎంజీఆర్ (మరుతూర్ గోపాల రామచంద్రన్) పాత్రలో ప్రముఖ నటుడు అరవింద స్వామి నటిస్తున్నారు.
అయితే బోల్డ్ హీరోయిన్ గా స్టార్ డమ్ సంపాదించిన కంగనా లాంటి హాట్ బ్యూటీ పక్కన అరవింద స్వామి లాంటి కూల్ హీరో సూట్ అవుతాడా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బయోపిక్ కావడంతో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జయలలిత- ఎంజీఆర్ పాత్రలు చేస్తున్న కంగన, అరవిందస్వామి మధ్య ప్రేమ పుట్టేటప్పుడు కెమిస్ట్రీ వర్కవుట్ అవుతుందా ? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక కంగనా రనౌత్‌ను తన అచ్చం అమ్మలా తీర్చిదిద్దేందుకు హాలీవుడ్ సినిమా డార్కెస్ట్ హవర్‌కు మేకప్ మెన్ గా పనిచేసిన గ్యారీ ఓల్డ్ మాన్ కృషి చేస్తున్నారు. ఇప్పటికే అమ్మ బయోపిక్‌లో నటిస్తున్న కంగనా తమిళం నేర్చుకుంటోంది. ఈ క్రమంలోనే అమ్మలా బొద్దుగా కనిపించేందుకు బరువు పెరిగేందుకు ముమ్మరంగా కసరత్తులు చేస్తోంది. 10 కిలోల పాటు ఆమె బరువు పెరగనుంది.
ఇక ఈ సినిమాలో కంగనా అమ్మగా 16 ఏళ్ల వయసు పాత్ర నుంచి 60 ఏళ్ల వయసు గల పాత్ర వరకూ ఈ సినిమాలో కనిపించనుంది. ఈ క్రమంలో కంగనా మొత్తం నాలుగు గెటప్స్ లో కనిపించనుంది.