టాలీవుడ్లో బలమైన మార్కెట్‌ను సొంతం చేసుకున్న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే కథానాయకుల్లో ఒకరిగా.. బలమైన అభిమాన గణమున్న హీరోల్లో ఒకరిగా సూర్య గుర్తింపు పొందారు. నటుడిగానే కాకుండా, నిర్మాతగా, టెలివిజన్ వ్యాఖ్యాతగా కూడా ఆయనకు మంచి పేరు ఉంది. హీరోగా ఇప్పుడు తన కెరీర్ లో సాలిడ్ లైనప్ ని సెట్ చేసుకున్న సంగతి తెలిసిందే.
అయితే..హీరో సూర్య నటిస్తున్న కొత్త సినిమా ‘కంగువా’ పిరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఫ్యాన్ మేడ్ పోస్టర్ ఒకటి వైరల్ అవుతుంది. యోధుడిలా కనిపిస్తున్న సూర్య భుజంపై ఓ పక్షి నిల్చోని ఉన్న పిక్ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో దిశా పటానీ, నయనతార నటిస్తుండగా… దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.