ఒడిశా రాష్ట్రంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఒడిశాలోని భారాగడ్ జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. లైమ్ స్టోన్ ను తీసుకెళ్తున్న రైలులో ఐదు బోగీలు మెంధపలి సమీపంలో పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదు. ఇక ఈ సంఘటన పై అధికారులు ఆరా తీస్తున్నారు.
కాగా, కోరమండల్ ఘోర రైలు ప్రమాదం పై రంగంలోకి దిగనుంది సీబీఐ. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టమ్ ట్యాపరింగ్ జరిగినట్టు రైల్వే సేఫ్టీ కమిషన్ ప్రాథమిక నివేదిక ఇచ్చింది. లోకోపైలెట్ల వైఫల్యం లేదని నిర్ధారణకు రావడం.. కుట్ర కోణం వెలుగులోకి రావడంతో సీబీఐ దర్యాప్తు చేయనుంది. మొదటి నుంచి ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేశారు బెంగాల్ సీఎం మమతా.