కాంతారా.. ఓటీటి లో వచ్చేది అప్పుడేనా..?

-

కేజిఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా పేరు సంపాదించిన సంస్థ హొంబలే. అయితే ఈ సంస్థ నిర్మించిన మరొక పాన్ ఇండియా చిత్రం కాంతారా. ఇక ఈ సినిమాలో హీరోగా రిషబ్ శెట్టి నటించారు. అలాగే దర్శకత్వం కూడా ఈయనే వహించారు. ఈ చిత్రానికి నిర్మాతగా విజయ్ కిరగందూర్. ఇటీవల ఈ చిత్రం కన్నడలో విడుదలై మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తెలుగు హక్కులను మాత్రం ప్రముఖ నిర్మాతలలో ఒకరైన అల్లు అరవింద్ సొంతం చేసుకున్నారు. ఈ చిత్రం ఈనెల 15న విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోని ఓటీటి లో ఈ సినిమా విడుదలపై కూడా పలు వార్తలు వినిపిస్తున్నాయి.

ట్రెండ్ వర్గాల నుంచి కొంతమంది అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఓటీటి హక్కులను అమెజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకున్నట్లుగా సమాచారం. అయితే ఈ సినిమా విడుదల డేట్ పై మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఈ సినిమా తెలుగులో థియేటర్ లో విడుదలైన 40 రోజుల తర్వాత మాత్రమే ఓటీటి లో కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అప్పుడే అన్ని భాషలలో ఒకేసారి విడుదల చేయబోతున్నట్లు సమాచారం. అయితే కన్నడలో భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం తెలుగులో సక్సెస్ కాలేకపోయిందంటే.. ముందుగానే విడుదల అయ్యే అవకాశం ఉంది.

ఈ చిత్రాన్ని తెలుగులో గీత ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల చేయబోతున్నారు. ఈ చిత్ర ట్రైలర్ కూడా కాస్త పుష్ప సినిమాలోని కొన్ని సన్నివేశాలు తలపిస్తూ ఉండడంతో ఈ సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం కూడా ఒక మిస్టరీ కథ అన్నట్లుగా హీరో రిషబ్ శెట్టి తెలియజేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news