‘విరాటపర్వం’పై బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కన్ను..రీమేక్ చేస్తారా?

ఇటీవల కాలంలో సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ బాలీవుడ్ లో రీమేక్ చేసి హిట్స్ అందుకుంటున్నారు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్. ఈ నేపథ్యంలోనే దక్షిణాది భాషల చిత్రాలను చాలా క్లీన్ గా బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ పరిశీలిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే ఈ నెల 17న విడుదల కానున్న సాయిపల్లవి-రానాల ‘విరాట పర్వం’ సినిమాపైనా బాలీవుడ్ మేకర్స్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

తాజాగా విడుదలైన ‘విరాట పర్వం’ ట్రైలర్ పైన బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ట్రైలర్ ఫెంటాస్టిక్ గా ఉందని, రానాను ఇంటెన్స్ రోల్ లో చూడటం కోసం తాను వెయిట్ చేస్తున్నానని, సాయిపల్లవికి తాను పెద్ద అభిమానని ట్వీట్ చేశాడు. కాగా, టాలీవుడ్ ఫిల్మ్ పైన కరణ్ జోహార్ కామెంట్స్ చేయడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

భవిష్యత్తులో ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేసే ఆలోచన కరణ్ జోహార్ మదిలో ఉందా? అని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ‘నీది నాది ఒకే కథ ’ ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నక్సలిజం నేపథ్యంలో కొనసాగుతూనే , హీరో-హీరోయిన్ మధ్య లవ్ స్టోరిలాగా ఉండబోతున్నదని ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది.