హైదరాబాద్‌లో అత్యాచారాల పరంపర కొనసాగుతోంది. నిన్నటికి నిన్ని అమ్నీషియా పబ్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ మరవకముందే.. వరుసగా అత్యాచార ఘటనలు చోటు చేసుకోవడం భాగ్యనగరంలో కలకలం రేపుతోంది. అమ్నీషియా ఘటన తరువాత.. ఓ బాలికను క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ ఘటన, నిన్న నెక్లెస్ రోడ్డులో బర్త్‌డే పార్టీకి పిలిచి మరో బాలికపై వ్యక్తి కారులోనే రేప్ చేశాడు. ఈ ఘటనల గురించి విచారణ జరుగుతుండగానే.. మరో దారుణ ఘటన సికింద్రాబాద్‌లోని కార్ఖానాలో చోటు చేసుకుంది. కార్ఖానా పరిధిలో ఓ బాలిక సామూహిక అత్యాచారానికి గురైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రెండు నెలల క్రితం బాలికపై గ్యాంగ్ రేప్ జరగ్గా బాలిక తల్లిదండ్రులు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.
బాధిత బాలికతో ఇద్దరు యువకులు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకున్నారు. మాయ మాటలతో బాలికను ఆకర్షించారు. ఈ క్రమంలో బాలిక వారిని కలవగా ఆమెను శారీరకంగా లోబరుచుకుని… గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఆ సమయంలో సెల్‌ఫోన్లలో వీడియోలు చిత్రీకరించారు. ఆ వీడియోలను అడ్డుపెట్టుకుని బాలికను బ్లాక్‌మెయిల్ చేశారు. దీంతో బాలిక వారు చెప్పినట్లు చేసింది. వీడియోలు తొలగిస్తామని చెప్పి ఓరోజు ఆమెను పిలిపించిన యువకులు… మరికొందరు స్నేహితులతో కలిసి బాలికపై మరోసారి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు.
మొత్తం ఐదుగురు బాలికపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ కార్ఖానా పరిధిలో బాలికపై రేప్ జరిగినట్లు సమాచారం. గ్యాంగ్ రేప్ తర్వాత బాలిక ప్రవర్తనలో మార్పు వచ్చింది. మానసికంగా కుంగిపోయింది. కూతురు ఎప్పుడూ ముభావంగా ఉండటం గమనించి.. తల్లిదండ్రులు ఆమెను సైక్రియాటిస్ట్ వద్దకు తీసుకెళ్లారు. తనపై జరిగిన గ్యాంగ్ రేప్‌ను బాలిక సైక్రియాటిస్ట్‌తో చెప్పింది. సైక్రియాటిస్ట్ ఆమె కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో వారు షాక్ తిన్నారు. మే 30న వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.