కార్తి ‘దేవ్’ ఫస్ట్ లుక్

-

కోలీవుడ్ హీరో అయినా సరే తెలుగులో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు కార్తి. తన సోదరుడు సూర్య కూడా తెలుగు, తమిళ భాషల్లో ఒకేరకమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సూర్యతో పాటుగా తెలుగులో కార్తి కూడా పాపులారిటీ సంపాదించాడు. అందుకే కార్తి ఏ సినిమా చేసినా తెలుగు డబ్బింగ్ వర్షన్ రెడీ అవుతుంది. లేటెస్ట్ గా కార్తి హీరోగా నటిస్తున్న సినిమా దేవ్.

రజత్ రవిశంకర్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఫస్ట్ లుక్ లో కార్తి చేతిలో హెల్మెట్, వెనుక స్పోర్ట్ బైక్ తో స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇదేదో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కి సంబందించిన కథగా హింట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. కార్తి సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

ఖాకి సినిమా తర్వాత కార్తి, రకుల్ కలిసి చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ అంచనాలను పెంచింది. రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకుంది. ఇది కాకుండా రకుల్ ఎన్.టి.ఆర్ బయోపిక్ లో శ్రీదేవి పాత్రలో నటిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news