బుల్లితెర మీద చిట్టిబాబు హంగామా

-

స్టార్ హీరోగా కొన్నాళ్లుగా వెనుకపడి ఉన్న రాం చరణ్ ధ్రువతో సక్సెస్ ట్రాక్ ఎక్కగా రంగస్థలం తో రికార్డుల అంతు చూశాడు. నాన్ బాహుబలి రికార్డులను తన మీద రాసుకున్న రాం చరణ్ చిట్టిబాబు పాత్రలో చితగ్గొట్టేశాడు. ఇక ఈ సినిమా తర్వాత రాం చరణ్ బోయపాటి శ్రీను డైరక్షన్ లో మూవీ చేస్తున్నాడు. రంగస్థలం సినిమా సిల్వర్ స్క్రీన్ పై సందడి అందరికి తెలిసిందే.

ఇక లేటెస్ట్ గా బుల్లితెర మీద కూడా చిట్టిబాబు హంగామా చూపించాడు. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రంగస్థలం సినిమా అత్యధికంగా 19.5 రేటింగ్ సంపాదించింది. స్టార్ మాలో అక్టోబర్ 14న టెలికాస్ట్ అయిన రంగస్థలం స్మాల్ స్క్రీన్ పై కూడా సందడి చేసింది. అయితే మిగతా సినిమాలతో పోల్చితే ఇది తక్కువే కాని సినిమా ఈ రేంజ్ లో టి.ఆర్.పి తెచ్చుకోవడం ఓ రికార్డే.

సినిమాను అమేజాన్ ప్రైం ఇప్పటికే ఆన్ లైన్ లో రిలీజ్ చేశారు. అక్కడ కూడా లక్షమంది దాకా వీక్షించారని తెలుస్తుంది. సినిమాను థియేటర్లలో కూడా రిపీటెడ్ ఆడియెన్స్ చూశారు. ఇంత చూసినా సరే మళ్లీ స్మాల్ స్క్రీన్ పై 19.5 టి.ఆర్.పి తెచ్చుకోవడం మాములు విషయం కాదు. చరణ్ కెరియర్ లో మగధీర సినిమా 24 టి.ఆర్.పి రేటింగ్స్ తో బాహుబలి సీరీస్ ల తర్వాత స్థానంలో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news