కోలీవుడ్ హీరో కార్తీ నటించిన సినిమా ఖైదీ. సందీప్ కిషన్ హీరోగా గతంలో నగరం వంటి వైవిధ్యమైన సినిమాను తెరకెక్కించిన లోకేష్ కనకరాజ్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇక దీపావళి కానుకగా తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఇక ఖైదీ గత కొద్ది రోజులుగా సరైన హిట్ లేక రేసులో వెనకపడుతున్నాడు. ఇక ఖైదీ సినిమాతో ఖచ్చితంగా హిట్ కొడతానని కార్తీ ఫుల్ కాన్ఫిడెంట్‌తో ఉన్నాడు.
కమర్షియల్ అంశాలకు దూరంగా ప్రయోగాత్మకంగా ఖైదీ తెరకెక్కింది. ఇక ఈ సినిమా కథ కూడా లీక్ అయ్యింది. కథ మెయిన్ లైన్ ఆసక్తిగా ఉండడంతో ఖైదీ సంచలనాలు క్రియేట్ చేస్తుందా ? అన్న అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ సినిమాలో కార్తీ జీవిత ఖైదు పడిన పరారీ ఖైదీగా నటిస్తున్నారు.
ఇక అతని కోసం ఒక రాత్రంతా జరిగే పోలీసుల మరియు రౌడీల వేటే ఖైదీ చిత్రం. ఈ సినిమాలో అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే హీరోయిన్ కానీ… పాటలు కానీ ఉండవు. కార్తీ మాత్రం తన పదేళ్ల కుమార్తెను కలుసుకోవడానికి జైలు నుంచి పారిపోతాడట.
ఈ క్రమంలోనే ఖైదీలో ఉత్కంఠ రేపే పోరాటాలతో పాటు, కంటతడి పెట్టించే బలమైన ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఉంటాయట. మెయిన్ లైన్ వింటుంటూనే ఖైదీ కథ చాలా హార్ట్ టచ్చింగ్‌గా అనిపిస్తోంది. ఇక దీపావళి కానుకగా అక్టోబర్ 25న ఈ సినిమా రిలీజ్ అవుతుండగా.. అదే రోజు విజయ్ – ఆట్లీ విజిల్ కూడా తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ అవుతోంది.