తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 15వ రోజుకి చేరుకుంది. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన బంద్‌కు పద్దెనిమిది ఉద్యోగ సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. అయితే తెలంగాణ బంద్ నేపథ్యంలో ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. హైదరాబాద్, భద్రాచలం వైపు బస్సులు రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుండి తెలంగాణాకు వెళ్లే అన్ని బస్సులు ఆపేశామని డీసీటీఎం మూర్తి తెలిపారు.
బంద్ వల్ల ప్రయాణికులు సంఖ్య కూడా బాగా తగ్గిందన్నారు. తెలంగాణ లో పరిస్థితి ఉద్రిక్తతంగా ఉండటం వల్ల ప్రయాణికుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని సర్వీసులు రద్దు చేశామన్నారు. వీకెండ్ కావడంతో సంస్థకు కూడా నష్టం జరిగిందని ఆయన తెలిపారు. మధ్యాహ్నం మరోసారి తమ ఉన్నతాధికారులు సమీక్ష జరిపి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.