లోకల్ అండ్ ఫ్రెష్ టాలెంట్‌ని కత్రినా బాలీవుడ్‌కి ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటుందట. ఇక మరోవైపు కత్రిన ప్రస్తుతం సల్మాన్ తో కలిసి భారత్ చిత్రంలో నటించింది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రంజాన్ కానుకగా జూన్ 5న విడుదల కానుంది.
బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లు గ్లామర్ తో ఆడియెన్స్ మతి పోగొడుతూనే అద్బుత నటనతో మంత్రముగ్ధుల్ని చేస్తున్నారు. మరోవైపు తమలోని ప్యాషన్‌ని బయటపెడుతున్నారు. ప్రొడక్షన్స్ స్టార్ట్ చేసి సినిమాపై తమ అభిరుచని చాటుకుంటున్నారు. ప్రియాంక చోప్రా ఇప్పటికే లో బడ్జెట్ ఫిల్మ్స్ ని, వివిధ లోకల్ లాంగ్వేజెస్ మూవీస్‌ని పొడ్రూస్ చేస్తుంది. నూతన ప్రతిభని ప్రోత్సహిస్తుంది. ఆమెతోపాటు అనుష్క శర్మ సైతం నయా టాలెంట్‌ని ఎంకరేజ్ చేయడంలో ముందే ఉంది.
దీపికా పదుకొనె తాను నటిస్తున్న తాజా సినిమా ఛప్పాక్ తో నిర్మాతగా మారింది. దీనికి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తుంది. ఇప్పుడు ఈ జాబితాలో కత్రినా కైఫ్ చేరబోతుంది. ఆమె కూడా ఫ్రెష్ టాలెంట్‌ని ఎంకరేజ్ చేయాలని నిర్ణయించుకుంది. త్వరలోనే ఓ ప్రొడక్షన్ హౌస్‌ని స్టార్ట్ చేయబోతుంది. అది ఈ ఏడాదిలోనే ఉండబోతుందట. అందుకు సంబంధించిన ప్లాన్ శరవేగంగా జరుగుతున్నట్టు కత్రినా ఓ ప్రైవేట్ ఈవెంట్ పాల్గొన్న సందర్భంగా తెలిపింది. తొలి సినిమా శక్తి వంతమైన కంటెంట్‌తో ఉండాలని భావిస్తుందట. అంతేకాదు ఇందులో తాను కూడా నటిగా నటించాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
లోకల్ అండ్ ఫ్రెష్ టాలెంట్‌ని బాలీవుడ్‌కి ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటుందట. ఇక మరోవైపు కత్రిన ప్రస్తుతం సల్మాన్ తో కలిసి భారత్ చిత్రంలో నటించింది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రంజాన్ కానుకగా జూన్ 5న విడుదల కానుంది. ఇది స్వాతంత్రం వచ్చినప్పట్నుంచి ఇప్పటి వరకు భారత్ అనే వ్యక్తికి సంబంధించి ఐదు దశాబ్దాల జర్నీని తెలియజేస్తుంది. సల్మాన్ ఐదు భిన్న గెటప్స్ లో దర్శనమిస్తున్నారు. కత్రినా కూడా డిఫరెంట్ లుక్స్ లో మెరవనుంది. దిశా పటానీ, టబు ఇతర కీలక పాత్రధారులు. దీంతోపాటు కత్రినా అక్షయ్ కుమార్‌తో కలిసి సూర్యవంశీలో కత్రినా నటిస్తుంది.