టెన్త్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం.. జీతం 60 వేలు.. అప్లయి చేయండిలా..!

-

అప్లయి చేసుకున్న అభ్యర్థులకు సంగీతం మీద పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత ఫిజికల్ ఫిట్ నెస్ పరీక్ష ఉంటుంది. రెండింట్లో నెగ్గితే ఉద్యోగం మీదే. ట్రెయినింగ్ లో 14,600 రూపాయల స్టయిఫండ్ ఇస్తారు. రెగ్యులర్ అయ్యాక జీతం 60 వేల వరకు వస్తుంది.

మీరు పదో తరగతి ఉత్తీర్ణులయ్యారా? అయితే.. మీ కోసమే ఈ బంపర్ ఆఫర్. కేవలం పదో తరగతి ఉత్తీర్ణత అయితే చాలు… జీతం 60 వేల రూపాయలు వచ్చే ప్రభుత్వ ఉద్యోగం ఉంది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇటీవలే జారీ అయింది. కాకపోతే మీకు ఇప్పటికే పెళ్లి అయి ఉండకూడదు. పురుషులకే ఈ జాబ్. ఇంతకీ జాబ్ ఎందులో అంటారా? దేశం కోసం పని చేసే అవకాశం లభించే ఇండియన్ నేవీలో. సెయిలర్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఇండియన్ నేవీ.

sailor musician  jobs notification in Indian Navy

సెయిలర్ లో మ్యుజీషియన్ జాబ్ కోసం నోటఫికేషన్ రిలీజ్ అయింది. పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు.. మ్యూజిక్ కు సంబంధించిన అనుభవం ఉండాలి. దాని సర్టిఫికెట్ ఉండాలి. ఎత్తు 157 సెంటీమీటర్లు ఉండాలి. ఈ పోస్టు కోసం ఫిజికల్ టెస్టులను కూడా పాసవ్వాల్సి ఉంటుంది. వయసు 17 నుంచి 21 మధ్య ఉండాలి.

మే 6, 2019 నుంచి మే 19, 2019 వరకు అప్లయి చేసుకోవచ్చు.

ఫిజికల్ టెస్ట్ విషయానికి వస్తే… 1.6 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 7 నిమిషాల్లో పూర్తి చేయాలి. 10 పుషప్ లు, 20 గుంజీలు కూడా తీయాల్సి ఉంటుంది.  ఈ ఉద్యోగానికి అప్లయి చేయదలుచుకున్నవాళ్లు… 1994 అక్టోబర్ 1 నుంచి 2002 సెప్టెంబర్ 30 మధ్య జన్మించి ఉండాలి.

అప్లయి చేసుకున్న అభ్యర్థులకు సంగీతం మీద పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత ఫిజికల్ ఫిట్ నెస్ పరీక్ష ఉంటుంది. రెండింట్లో నెగ్గితే ఉద్యోగం మీదే.  ట్రెయినింగ్ లో 14,600 రూపాయల స్టయిఫండ్ ఇస్తారు. రెగ్యులర్ అయ్యాక జీతం 60 వేల వరకు వస్తుంది.

జులై 6 నుంచి 10 వరకు దీనికి సంబంధించిన టెస్టులు జరగనున్నట్టు నేవీ ప్రకటనలో తెలిపింది. మరిన్ని వివరాలకు, దరఖాస్తు నింపడానికి www.joinindiannavy.gov.in వెబ్ సైట్ కు వెళ్లి చెక్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news