మహేష్ తో సినిమా చేసేది లేదని చెప్పిన కీర్తి…!

-

సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయడానికి ఎందరో హీరోయిన్ లు పోటీ పడుతూ ఉంటారు. అలాంటిది ఒక హీరోయిన్ మాత్రం ఆయనతో సినిమా ఆఫర్ వచ్చినా సరే వద్దని చెప్పినట్టు సమాచారం. దానికి కారణం ఏంటో స్పష్టంగా తెలియదు గాని మహేష్ సినిమా చేస్తారా అని అడగగానే ఆమె నో చెప్పేసింది. ఏంటి ఆ కథ అనేది చూద్దాం. పరుశురాం దర్శకత్వంలో మహేష్ బాబు ఒక సినిమా చేస్తున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ని తీసుకోవాలని భావించింది చిత్ర యూనిట్. ఇదే విషయాన్ని కీర్తి సురేష్ కి చెప్పి అడగగా ఆమె నో చెప్పింది. ఎందుకు అంటే మహేష్ సినిమాలు కమర్షియల్ గా ఉంటాయి. అందులో తాను ఏదోక పాటలో స్కిన్ షో చెయ్యాల్సి ఉంటుంది. అందుకే ఆమె నో చెప్పేసింది. మహేష్ సినిమా పూర్తిగా కమర్షియల్ హంగులతో ఉంటుంది కాబట్టి… తాను స్కిన్ షో చేయలేను ని మొహం మీదే చెప్పింది ఆమె.

తనకు అవసరం లేదని ఆమె స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. తాను ఎప్పుడు స్కిన్ షో చేయలేదు, ఇప్పుడు కూడా తాను చేయలేను అని చెప్పిందట. దీనితో చేసేది లేక దర్శకుడు మరో హీరోయిన్ ని ఎంపిక చేసినట్టు సమాచారం. ఆమెకు భారీగా డిమాండ్ చేసినా ఆమె మాత్రం నో అని చెప్పినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రద్దా కపూర్ ని అనుకున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news