కేరళ ప్రభుత్వ ఆహ్వనం అందుకున్న బన్ని

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు కేరళ ప్రభుత్వం నుండి ఆహ్వానం అందించినట్టు సమాచారం. టాలీవుడ్ లోనే కాదు మల్లూవుడ్ లో కూడా అల్లు అర్జున్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. బన్ని సినిమాలు అక్కడ కూడా భారీగా రిలీజ్ అవుతాయి. సరైనోడు, డిజే సినిమాలు కేరళలో మంచి కలక్షన్స్ రాబట్టాయి. అంతేకాదు మన దగ్గర ఫ్లాప్ అయిన నా పేరు సూర్య సినిమా అక్కడ హిట్ అయ్యింది.

కేరళలో బన్నిని మల్లూస్టార్ అని పిలుస్తారు. ఇటీవల కేరళ వరదల వల్ల అక్కడ భారీ నష్టం వాటిల్లింది. సిని పరిశ్రమ నుండి పెద్ద ఎత్తున విరాళాలు కేరళ ప్రభుత్వానికి అందాయి. ఈ క్రమంలో తెలుగు పరిశ్రమ నుండి అల్లు అర్జున్ పాతిక లక్షలను కేరళ ప్రభుత్వానికి అందించారు. కేరళ ప్రభుత్వ త్వరలో ఏర్పరిచే ఓ కార్యక్రమానికి బన్నిని ఆహ్వానించారట.

బన్ని కూడా అందుకు ఓకే అన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం బన్ని త్రివిక్రం సినిమా కోసం రెడీ అవుతున్నాడట. డిసెంబర్ లోనే ఈ సినిమా ముహుర్తం ఉంటుందని తెలుస్తుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లో ఈ సినిమా నిర్మించబడుతుందట.

Read more RELATED
Recommended to you

Exit mobile version