సుశాంత్ రాజ్‌పుత్ కేసు కేసులో డ్రగ్స్ యాంగిల్‌కు సంబంధించి ఇద్దరు వ్యక్తులను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) అరెస్ట్ చేసింది. ముంబైలోని బాంద్రాకు చెందిన అబ్దుల్ బాసిత్ పరిహార్ ను అరెస్టు చేసినట్లు ఏజెన్సీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. “అతనికి శామ్యూల్ మిరాండాతో సంబంధం ఉంది. షోయిక్ చక్రవర్తి ( రియా చక్రవర్తి సోదరుడు) సూచనల మేరకు మిరాండా డ్రగ్స్ సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి”అని జాతీయ మీడియా ఒకటి నివేదించింది.
మిరాండా… రాజ్‌పుత్ మాజీ హౌస్ కీపింగ్ మేనేజర్. గతేడాది మేలో రియా చక్రవర్తి ఆయనను నియమించారు. అతను సుశాంత్ ఇంటి ఖర్చులన్నీ చూసేవాడు. రాజ్‌పుత్ కుటుంబం మిరాండాపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. అయితే రియా చక్రవర్తికి సుశాంత్ డబ్బులను అతనే అందించాడు అని విచారణలో వెల్లడి అయింది. ఈ కేసుకి సంబంధించి మరికొన్ని అరెస్ట్ లు ఉండే అవకాశం ఉంది.