కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న KGF2..బాలీవుడ్‌లో సరికొత్త రికార్డు

దేశవ్యాప్తంగా గురువారం విడుదలైన KGF2 ఫిల్మ్ రికార్డుల వేట కొనసా..గుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పిక్చర్ వరల్డ్ క్లాస్ పిక్చర్ అని సినీ పరిశీలకులు చెప్తున్నారు. సినీ ప్రముఖులు, లవర్స్ సినిమా చూసి ఎలివేషన్ కా బాప్, ఎక్సలెంట్ మేకింగ్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ చిత్రం ఇప్పటి వరకు ఉన్న రికార్డులను తిరగ రాస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఒకే ఒక రోజులో రూ.134 కోట్లు కలెక్ట్ చేసిన ఈ పిక్చర్…RRR తర్వాత దూసుకుపోతున్న సినిమాగా ఉంది. బాక్సాఫీసుపైన కేజీఎఫ్ 2, రాఖీ భాయ్ దండయాత్ర కొనసాగుతున్నది. రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.240 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా. ఈ విషయం తెలుసుకుని సినీ అభిమానులు గర్వపడుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రెండు రోజుల్లో రూ.290 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. బాలీవుడ్ లో రెండే రోజుల్లో వంద కోట్లు కలెక్షన్స్ రాబట్టడం సరికొత్త రికార్డని సినీ పరిశీలకులు చెప్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజలు కేజీఎఫ్ 2 పిక్చర్ ను విశేషంగా ఆదరిస్తున్నారు.

kgf
kgf

వెండితెరపైన యశ్, శ్రీనిధిశెట్టి , సంజయ్ శెట్టి తదితర తారాగణాన్ని చూసి సినీ లవర్స్ సంతోషం వ్యక్తం చేస్తు్న్నారు. ప్రశాంత్ నీల్ ఎలివేషన్ కా బాప్ అని పొగిడేస్తున్నారు సినీ అభిమానులు. ఈ సినిమా అతి త్వరలో రూ.1,000 కోట్ల క్లబ్ లోకి చేరిపోతుందని ఈ సందర్భంగా పలువురు సినీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.