కీర్తి సురేష్ ఇలా అయిందేంటి.. షాక్ అవుతున్న ఫ్యాన్స్..!

అప్పటివరకు సాదాసీదా హీరోయిన్ గా ఉన్న కీర్తి సురేష్ మహానటి చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమలో గుర్తింపు సంపాదించుకుని ఈ స్టార్ హీరోయిన్ గా మారిపోయిన విషయం తెలిసిందే. మహానటి సినిమా బ్లాక్ బస్టర్ విజయం తర్వాత కీర్తి సురేష్ కెరియర్ కీలక మలుపు తిరిగింది. ఆతర్వాత ఎన్నో అవకాశాలు వచ్చి ఈ అమ్మడి చెంత వాలాయి . మహానటి సినిమా కు జాతీయ అవార్డు కూడా అందుకున్న విషయం తెలిసిందే. ఇక మహానటి తర్వాత ఆ స్థాయిలో విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది కీర్తి సురేష్. సాధారణంగా కీర్తి సురేష్ అంటే కాస్త బొద్దుగా ఉండి ఎంతో ముద్దుగా కనిపిస్తూ ఉంటుంది.

అందాల ఆరబోత చేయక పోయినప్పటికీ కీర్తి సురేష్ లో ఈ బొద్దుతనం ఎక్కువగా ఇష్టపడుతుంటారు అభిమానులు. మిస్ ఇండియా సినిమా కోసం ఎంతగానో సన్న పడిపోయింది కీర్తి సురేష్. ఇక ఇటీవల కీర్తి సురేష్ కి సంబంధించిన లుక్ జనాల ముందుకు రాక ఈ లుక్ పై నెగిటివ్ రెస్పాన్స్ ఎక్కువగా వస్తుంది. బొద్దుగా ముద్దుగా వుండే కీర్తి సురేష్ ఇలా మారిపోయింది ఏంటి అసలు బాగాలేదు అంటూ కామెంట్ చేస్తున్నారు ఎంతోమంది అభిమానులు. కీర్తి సురేష్ హోమ్లీ హీరోయిన్గా బొద్దుగా ముద్దుగా ఉంటేనే బాగుంటుంది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.