బ్యాక్‌గ్రౌండ్, బ్యాంక్ బ్యాలన్స్ ఉండి సినీఇండస్ట్రీలో అడుగుపెట్టినవారు ఎందరో. అలా చాలామంది సినిమాపై ఉన్న ఆసక్తితో నటుడిగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇప్పుడా ఆ కోవలోనే తన లక్ పరీక్షించుకున్నారు ఓ బిజ్నెస్మ్యాన్. హీరోగా గ్రాండ్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు. ఆయనే ది లెజెండ్ శరవణన్. దాదాపు రూ.60కోట్లకు పైగా బడ్జెట్‌తో చిత్రం ‘ది లెజెండ్’ అనే సినిమాతో ఆయన వెండితెర అరంగేట్రం చేశారు. వ్యాపారవేత్తగా రాణించిన ఆయన 52ఏళ్ల వయసులో కథానాయకుడిగా మారారు. ఒక్కసారిగా భారీ ప్రమోషన్స్‌తో వెలుగులోకి వచ్చారు. ఇక ఈ భారీ ప్రాజెక్ట్‌లో ఊర్వశి రౌటేలా కథానాయిక. ఇపుడామె పారితోషికం విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఆమె 10 సినిమాలు చేసినా.. రానంత రెమ్యునరేషన్‌ను ఊర్వశీకి ఇచ్చారట నిర్మాత శరవణన్. ఆ సంగతులు తెలుసుకుందాం.
జె.డి.-జెర్రీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శరవణ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శరవణన్ నిర్మించారు. హ్యారిస్ జైరాజ్ సంగీత దర్శకుడు. ఈ సినిమాలో ప్రముఖ నటులు చాలా మంది నటించారు. దాదాపు రూ. 60కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు శరవణన్.
వాస్తవానికి ఊర్వశీ రౌతాలా.. బాలీవుడ్లో ఇప్పుడు చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు ఏవీ చేయట్లేదు. అవకాశాలు చాలా వరకు తగ్గిపోయాయి.ఒకవేళ ఆమె సినిమా చేస్తే.. రూ.2కోట్లకు మించిన పారితోషికం ఉండదనేది ట్రేడ్ వర్గాల అంచనా.
అయితే ‘ది లెజెండ్’ సినిమాకు మాత్రం.. ఊర్వశీ రౌతాలా కూడా ఊహించనంత చెక్ ఇచ్చారట శరవణన్. ఒకరకంగా చెప్పాలంటే.. ఆమెను సినిమాలో నటింపజేసేందుకు.. బ్లాంక్ చెక్ ఇచ్చినట్లు సమాచారం.
మొత్తం మీద ‘ది లెజెండ్’లో నటించేందుకు ఆమె దాదాపు రూ. 20కోట్ల పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది.ఒకవేళ ఇదే నిజం అయితే.. సౌత్‌లో ఇదే అత్యధిక పారితోషికం అవుతుంది.
ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న చాలా మంది స్టార్ హీరోలు కూడా రూ.20కోట్ల పారితోషికం అందుకోకపోవడం గమనార్హం.