కొర‌టాల సినిమాలో చిరు ఆ హీరోయిన్‌తోనే రొమాన్స్ చేస్తాడా…!

-

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. చిరు ఇటీవ‌లే సైరా న‌ర‌సింహారెడ్డి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కిన ఈ సినిమాకు మంచి ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఇక చిరు నెక్ట్స్ సినిమాకు అప్పుడే రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్టు ఫైనల్‌ వెర్షన్‌ జరుగుతోంది.

ఈ సినిమాలో మెగా అభిమానులు మెచ్చే అన్ని క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ పుష్క‌లంగా ఉంటాయ‌ట‌. హీరోయిజంతో పాటు అదిరిపోయే స్టెప్పులు, డైలాగుల‌తో పాటు మంచి సోష‌ల్ మెసేజ్ కూడా ఉంటుంద‌ట‌. ఫైన‌ల్‌గా మెగాస్టార్ – కొరటాల నుంచి ఒక పవర్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటెర్టైనర్ రానుంది. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌న‌వ‌రి నుంచి ప్రారంభం కానుంది.

ముందుగా రామోజీ ఫిల్మ్‌సిటీలో 20 రోజుల పాటు షూటింగ్ చేసి ఆ త‌ర్వాత శ్రీకాకుళం జిల్లా ప‌లాస ప్రాంతంలో షూటింగ్ జ‌రుగుతుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గురించి అదిరిపోయే అప్‌డేట్ వ‌చ్చింది. చిరు ప‌క్క‌న కాజ‌ల్ అగ‌ర్వాల్‌ను హీరోయిన్‌గా దాదాపు ఫైన‌లైజ్ చేసిన‌ట్టు స‌మాచారం. చిరు ప‌క్క‌న కాజ‌ల్ ఇప్ప‌టికే ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాలో న‌టించిన సంగ‌తి తెలిసిందే.

ఇక ఇప్పుడు మరోసారి ముదురు హీరోయిన్ అయిన ఆమె అయితేనే చిరు ప‌క్క‌న క‌రెక్టుగా సెట్ అవుతుంద‌ని.. ఆమెకు భారీ రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్ చేసి మ‌రీ ఆమెను హీరోయిన్‌గా కొర‌టాల సెట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇక వ‌చ్చే యేడాది స‌మ్మ‌ర్ టార్గెట్‌గా ఈ సినిమా రెడీ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news