తెలుగు సినిమా కథలు మారాయి.. సక్సెస్ ఫార్ములాలు మారాయి. ఒకప్పుడు ఏ తెలుగు సినిమాను తీసుకున్నా ఒకే కథను అటు తిప్పి ఇటు తిప్పి చెప్పినవే అనిపిస్తాయి. అయితే యువరక్తం వచ్చిన తర్వాత కథల పంథా మారింది.
తెలుగు సినిమా కథలు మారాయి.. సక్సెస్ ఫార్ములాలు మారాయి. ఒకప్పుడు ఏ తెలుగు సినిమాను తీసుకున్నా ఒకే కథను అటు తిప్పి ఇటు తిప్పి చెప్పినవే అనిపిస్తాయి. అయితే యువరక్తం వచ్చిన తర్వాత కథల పంథా మారింది. ప్రేక్షకుడు ఇదే కోరతాడు వాళ్లకు ఇదే ఇష్టం అంటూ ఇంకా రొటీన్ దారిలో వెళ్లే దర్శకులు ఉన్నా.. ప్రేక్షకుడిని మెప్పించే సినిమాలతో వస్తున్నారు నేటితరం దర్శకులు.
వారిలో మొదటిగా చెప్పుకోవాల్సి వస్తే కొరటాల శివ ఉంటాడు. స్టార్ సినిమా అంటే కేవలం కమర్షియల్ ఎంటర్టైమెంట్స్ మాత్రమే అందులో ఎలాంటి మెసేజులు ఇచ్చే అవకాశం ఉండదని అనుకున్నారు. కాని మిర్చి నుండి భరత్ అనే నేను వరకు కొరటాల శివ సినిమాలు చూస్తే అర్ధమవుతుంది. స్టార్ సినిమాకు ఓ అర్ధవంతమైన కథ ఉంటే ఎలా ఉంటుందో చూపించాడు కొరటాల శివ. మిగతా దర్శకులు అలా తీయరని కాదు కాని మూస థోరణిలో వెళ్తున్న తెలుగు సినిమాకు కొత్త దిశని చూపించాడు కొరటాల శివ.
మన సినిమాల్లో హీరో, హీరోయిన్ కు పెళ్లైతే సినిమా ముగుస్తుంది. కాని ఈ దర్శకుడు అక్కడ సినిమా మొదలు పెడతాడు. హీరో ప్రేమ ఫెయిల్ అయితే ఒకప్పుడు ప్రేక్షకులు ఒప్పుకునే వారు కాదు కాని తన ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని వేరే వాళ్ల భార్యగా చూపించి హిట్ కొట్టాడు.
ఇదిలాఉంటే ఇప్పుడు మరో దర్శకుడు అదే పంథా కొనసాగిస్తున్నాడు. మన సినిమాల్లో హీరో, హీరోయిన్ కు పెళ్లైతే సినిమా ముగుస్తుంది. కాని ఈ దర్శకుడు అక్కడ సినిమా మొదలు పెడతాడు. హీరో ప్రేమ ఫెయిల్ అయితే ఒకప్పుడు ప్రేక్షకులు ఒప్పుకునే వారు కాదు కాని తన ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని వేరే వాళ్ల భార్యగా చూపించి హిట్ కొట్టాడు. నిన్నుకోరితో దర్శకుడిగా పరిచయమైన శివ నిర్వాణ చెప్పిన కథ మనకు తెలిసిందే.. కాని తెర మీద చూపించడానికి సాహసం చేయడం గొప్ప విషయం.
నిన్నుకోరి తర్వాత మళ్లీ అలాంటి ఓ ప్రయత్నమే మజిలీతో చేశాడు శివ నిర్వాణ. ప్రేమ, క్రికెట్ రెండు ప్రాణంగా అనుకున్న పూర్ణ అనే అబ్బాయి లైఫ్ అంతా గందరగోళంగా మారుతుంది. అలాంటి టైంలో శ్రావణి అనే అమ్మాయి అతని జీవితంలోకి వస్తుంది. ఆమె ప్రేమించే పూర్ణని.. ఆమె ఎలా మార్చుకుంది అన్నది మజిలీ కథ. ఈ సినిమా కూడా మరోసారి శివ నిర్వాణ అసాధారణమైన ప్రతిభ బయట పెట్టింది.
ఆయన కొరటాల శివ అయితే ఈయన శివ నిర్వాణ.. ఇద్దరు కలిసి తెలుగు సినిమా పరిశ్రమ దశ దిశ మార్చేస్తున్నారు. గొప్ప కథ చెప్పడం వేరు.. ప్రేక్షకులు మెచ్చేలా చెప్పడం వేరు. ఈ ఇద్దరు అదే చేస్తున్నారు. వీరి దారిలో మరికొందరు కూడా సహజత్వంలో అసజమైన కథలను రాసుకుని తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుస్తారని ఆశిద్దాం.