మార్చి 8 న ఈ పాటను యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. ప్రముఖ సినీ రచయిత సుద్దాల అశోక్ తేజ ఈ గీతాన్ని రచించారు. ఫిదా సినిమా మ్యూజిక్ డైరెక్టర్ శక్తికాంత్ కార్తిక్ ఈ పాటకు మ్యూజిక్ అందించారు. గాయకుడు మనో ఈ పాటను పాడారు.
రావాలి జగన్.. కావాలి జగన్.. ఇది పాట మాత్రమే కాదు.. ఏపీలోని ప్రతి ఒక్కరు తమ మనసులో పాడుతున్న పాట. అవును… ఏపీ జనాల్లోకి అంతలా ఎక్కిపోయింది ఈ పాట. పొలిటికల్ పాట ఇలా యూట్యూబ్ లో సంచలనాలు సృష్టించడం అనేది చాలా అరుదు. పెద్ద పెద్ద హీరోల సినిమాల ట్రైలర్లు, టీజర్లకు, పాటలకు కూడా యూట్యూబ్ లో అంత రెస్పాన్స్ రాదు. కానీ.. రావాలి జగన్.. కావాలి జగన్ పాట మాత్రం యూట్యూబ్ ను షేక్ చేస్తోంది.
ఆ అరుదైన రికార్డును మాత్రం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సొంతం చేసుకున్నారు. వైఎస్సార్సీపీ పార్టీకి చెందిన అధికారిక ప్రచార గీతం అది. ఒక్క ఏపీలోనే కాదు.. తెలంగాణలోనూ ఉర్రూతలూగిస్తోంది. వైఎస్ అభిమానులే కాదు.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆ పాట తారకమంత్రంలా మారింది. యూట్యూబ్ లో షేర్ అయిన ఆ వీడియోకు ఇప్పటికే కోటిన్నరకు పైగా వ్యూస్ రావడం విశేషం.
మార్చి 8 న ఈ పాటను యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. ప్రముఖ సినీ రచయిత సుద్దాల అశోక్ తేజ ఈ గీతాన్ని రచించారు. ఫిదా సినిమా మ్యూజిక్ డైరెక్టర్ శక్తికాంత్ కార్తిక్ ఈ పాటకు మ్యూజిక్ అందించారు. గాయకుడు మనో ఈ పాటను పాడారు. ఈ పాటకు వస్తున్న స్పందనను చూసి ఇంగ్లీష్ న్యూస్ చానెళ్లు సైతం ప్రత్యేకంగా స్టోరీలు డిజైన్ చేసి.. ఆ పాటను తమ చానెళ్లలో ప్రసారం చేస్తున్నాయి.