టాలీవుడ్ లో దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత నూటికి నూరు శాతం సక్సెస్ రేటుతో తిరుగులేని కమర్షియల్ దర్శకుడు అనిపించుకున్నా కొరటాల శివ… తన చివరి సినిమా భరత్ అనే నేను తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి సినిమా కోసం ఏడాదిన్నర కాలంగా శివ ఎట్టకేలకు ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టించాడు. ఇంకా చెప్పాలంటే ఇప్పటికే రెండు సంవత్సరాలుగా మెగా కాంపౌండ్ లోనే ఉండి పోయాడు.
భరత్ అనే నేను తర్వాత ఒక ఠాగూర్ లాంటి సినిమా చేద్దామంటూ చిరంజీవిని అప్రోచ్ అయ్యాడు. గత యేడాది డిసెంబర్‌లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేద్దామంటూ చిరంజీవి శివను ఊరించి ఊరించి ఊసూరు మనిపించాడు. ఇక ఇప్పుడు సినిమా ప్రారంభోత్సవం జరుపుకున్నా కూడా ఈ సినిమాను త్వరగా పూర్తి చేద్దామన్న ఆలోచనే చిరుకు లేదన్న గుసగుసలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.
చిరుకు ఇప్పటికే 64 సంవత్సరాలు. ఆయనలో మునుపటి చురుకుదనం ఆశించడం అత్యాశే అవుతుంది. అయినా కొరటాల లాంటి స్టార్ డైరెక్టర్ టైం వేస్ట్ చేయడం చాలా మందికి నచ్చడం లేదు. షెడ్యూల్ స్టార్ట్ చేసి త్వరగా ఫినిష్ చేద్దామని కొరటాల చిరుపై గట్టిగా ఒత్తిడి చేస్తే… శివ అంత కంగారు వద్దు… స్లోగానే సినిమా చేద్దాం అనడంతో కొరటాల చిరు తీరుపై తీవ్ర అసహనంతో ఉన్నట్టు టాక్..?
ఇక చిరు ఇటీవల పర్సనల్ రిలాక్స్ కోసం ఎక్కువ టైం కేటాయిస్తుండడంతో శివ పరిస్థితి కక్కలేక మింగలేని చందంగా ఉంది. ఇక వచ్చే సమ్మర్‌కు పెద్ద సినిమాలు లేవు.. ఆ టైంకు సినిమా రిలీజ్ చేస్తే మంచి హిట్ అవుతుందన్నది కొరటాల నమ్మకం.. కానీ ఇప్పుడు ఇంకా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాకపోవడంతో ఈ సినిమా వచ్చే యేడాది సెకండాఫ్‌కే వెళ్లిపోయేలా ఉంది.