విజయ్ దేవరకొండతో కొరటాల శివ..?

-

విజయ్ దేవరకొండ హీరోగా కోలీవుడ్ దర్శకుడు ఆనంద్ రంగ డైరక్షన్ లో వస్తున్న సినిమా నోటా. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తమిళంలో కూడా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బజ్ బాగుంది. అయితే ఈ సినిమా తెలుగు ప్రమోషన్స్ లో భాగంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆడిటోరియం లో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కొరటాల శివ, వంశీ పైడిపల్లి అతిథిలుగా వచ్చారు.

విజయ్ కెరియర్ గ్రాఫ్ సినిమా సినిమాకు పెరుగుతుంది. అయితే ఈ విషయాన్నే ప్రస్థావిస్తూ కొరటాల శివ అర్జున్ రెడ్డి చూశాను.. తర్వాత గీతా గోవిందం వచ్చింది అది చూశాను రెండిటిలో అసలేమాత్రం సంబంధం లేని పాత్రలు చేసి మెప్పించాడు విజయ్ దేవరకొండ. అతని కోసం ఎలాంటి స్క్రిప్ట్ రాయాలో తెలియట్లేదని ఏదో ఒక రోజు తాను కూడా విజయ్ కు సరిపడే కథ రాసుకు వస్తానని అన్నాడు కొరటాల శివ. మిర్చి నుండి భరత్ అనే నేను వరకు సక్సెస్ లతో దూసుకెళ్తున్న దర్శకుడు కొరటాల శివ విజయ్ తో సినిమా చేస్తానని చెప్పడం నిజంగానే గొప్ప విషయమని అనాలి.

నోటా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా తన సినిమా ఆపాలంటూ వివాదాలు చేస్తున్న వారికి ఈ సినిమాలో అలాంటివి ఏమి ఉండవని. రాజకీయ పార్టీలు కావాలని ఈ విషయాన్ని ఎక్కువ చేస్తున్నాయని అన్నాడు విజయ్. ఎప్పుడు జోష్ ఫుల్ స్పీచ్ ఇచ్చి ఆడియెన్స్ ను అలరించే విజయ్ నోటా ఈవెంట్ లో కూడా అదరగొట్టాడు.

Read more RELATED
Recommended to you

Latest news