రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం తన 30 వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తయినప్పటికీ హీరోయిన్ల ఎంపిక విషయంలో కొంచెం తడబాటు పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది ఇలా ఉండగా.. అయితే ‘ఆచార్య’ ద్వారా వచ్చిన అనుకోని ఫలితం, RRR తో పెరిగిన ఎన్టీఆర్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని కొరటాల శివ మళ్లీ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట.

ఈసారి తెలుగు ప్రేక్షకులకే కాకుండా పాన్ ఇండియా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే ఆయన స్క్రిప్ట్ ను సిద్ధం చేసే పనిలో ఉన్నారట. అలాగే మరో ఆసక్తికరమైన వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అదేంటంటే, NTR 30ని 9 భాషల్లో విడుదల చేయాలని నిర్మాతలు అనుకుంటున్నారట. కాస్త ఆలస్యమైనా పర్లేదు కానీ, సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయాలనేదే ఆలోచనతో టీమ్ వర్క్ చేస్తుందట.