ఎన్టీఆర్ బయోపిక్.. మోక్షజ్ఞ ఉన్నట్టా.. లేనట్టా..!

-

నందమూరి నట వారసుడు బాలకృష్ణ తనయుడు తెరంగేట్రం గురించి నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లెజెండ్ సినిమా నుండి శాతకర్ణి వరకు బాలయ్య ప్రతి సినిమాలో మోక్షజ్ఞ కేమియో ఉందని చెప్పడం తీరా సినిమా చూసి నిరాశపడటం ఇదే జరుగుతుంది. ఇక ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమాలో అయినా మోక్షజ్ఞ నటిస్తున్నాడా లేదా అన్నది బయటకు రాలేదు.

ముందు ఎన్.టి.ఆర్ యుక్తవయసు పాత్రలో మోక్షజ్ఞను నటింపచేయాలని అనుకున్నా ఎందుకో కుదరలేదట. అది కూడా బాలయ్యే చేయడంతో మోక్షజ్ఞకు ఛాన్స్ లేకుండాపోయింది. మోక్షజ్ఞ ఎంట్రీపై క్రిష్, బాలయ్య ఓ నిర్ణయానికి రాలేదని తెలుస్తుంది. ఫైనల్ గా మనం సినిమాలో అఖిల్ కెమియో లాగా మోక్షజ్ఞను ఎంట్రీ ఇప్పించాలని డిసైడ్ చేశారట.

అదే జరిగితే ఎన్.టి.ఆర్ బయోపిక్ మోక్షజ్ఞకు మొదటి సినిమా అవుతుంది. కచ్చితంగా ఇది కూడా నందమూరి ఫ్యాన్స్ కు నచ్చే అంశమని చెప్పాలి. ఇక సినిమాలో కళ్యాణ్ రాం, రానా, సుమంత్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. రెండు పార్టులుగా వస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ మూవీ రెండు పార్టుల రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news