నాని.. నిఖిల్.. మల్టీస్టారర్

-

నాచురల్ స్టార్ నాని, యువ హీరో నిఖిల్ కలిసి ఓ సినిమా చేస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. నాని ప్రస్తుతం జెర్సీ సినిమా చేస్తుండగా నిఖిల్ ముద్ర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ ఇద్దరు కలిసి చేసే సినిమాను ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. నానిని అష్ట చమ్మతో హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ ఆ తర్వాత జెంటిల్మన్ సినిమా చేశాడు.

రెండు సినిమాలు మంచి ఫలితాన్ని అందుకున్నాయి. అసలైతే దేవదాస్ సినిమా తర్వాత మల్టీస్టారర్ సినిమాలు చేయనని నిర్ణయించుకున్న నానికి దర్శకుడు మోహనకృష్ణ చెప్పిన కథ నచ్చడంతో సినిమాకు ఓకే చెప్పాడట. మరి నాని, నిఖిల్ కలిసి చేస్తున్న ఈ మల్టీస్టారర్ ఎలా ఉండబోతుందో చూడాలి.

కచ్చితంగా కథాబలం ఉండుంటుంది కాబట్టే నాని ఈ సినిమాకు ఓకే చెప్పి ఉంటాడని అనుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ వరకు వరుస విజయాలు అందుకున్న నాని ఈ ఇయర్ కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ రెండు నిరాశపరచాయి. జెర్సీ అయినా నిలబెడుతుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news