మ‌ళ్లీ టాలీవుడ్ బాట ప‌ట్టిన కృతిస‌న‌న్‌.. వ‌రుస ఆఫ‌ర్ల‌తో బిజీ

హైట్‌, లుక్స్‌, యాక్టింగ్‌, డ్యాన్స్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది కృతిస‌న‌న్‌. తెలుగులో చేసింది రెండు సినిమాలే అయినా త‌న అందం, అభిన‌యంతో అంద‌రినీ ఆకట్టుకుంది. సుకుమార్‌, మ‌హేశ్‌బాబు సినిమా వ‌న్ నేనొక్క‌డినేతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. దీని త‌ర్వాత నాగ‌చైత‌న్య‌తో క‌లిసి దోచెయ్ సినిమా చేసింది. అయితే ఈ రెండు సినిమాల‌తో పెద్ద‌గా ఆఫ‌ర్లు రాలేదు.

దీంతో బాలీవుడ్ చెక్కేసింది. అక్క‌డ బాగానే స‌క్సెస్ అయింది. వ‌రుస సినిమాల‌తో జోరుమీదుంది. ఇప్పుడు మ‌ళ్లీ టాలీవుడ్‌పై న‌జ‌రేసింది ఈ పిల్ల‌. రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, ఓం రౌత్ కాంబినేష‌న్లో వ‌స్తున్న ఆదిపురుష్ సినిమాలో న‌టిస్తోంది.

ఇదొక్క‌టే కాదు ఇప్పుడు మ‌రోసారి సుకుమార్ డైరెక్ష‌న్‌లో రాబోతున్న‌ట్టు తెలుస్తోంది. సుకుమార్‌, విజ‌య్‌దేవ‌ర‌కొండ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో కృతిస‌న‌న్ హీరోయిన్‌గా చేస్తుంద‌ట‌. అంటే మ‌ళ్లీ టాలీవుడ్‌లోకి ఈ భామ ఎంట్రీ ఇస్తోంద‌న్న‌మాట‌. ఇప్పుడున్న స్టార్ హీరోయిన్ల‌కు కృతి ఫుల్ కాంపిటీష‌న్ ఇచ్చే అవ‌కాశం కూడా ఉంది.