మత్తెక్కించే చూపులతో కవ్విస్తున్న కృతి శెట్టి..కుర్రాళ్ళ గుండెలు గల్లంతు..!

-

బేబమ్మ అలియాస్ కృతి శెట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. కన్నడ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు చేసి తెలుగులో ఉప్పెన సినిమాతో విడుదలకు ముందే మంచి క్రేజ్ సంపాదించుకుంది. ముఖ్యంగా అబ్బాయిల కలల రాకుమారిగా పాపులారిటీ దక్కించుకున్న ఈమె ఆ తర్వాత బంగార్రాజు , శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాలలో నటించి వరుసగా హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఆ తర్వాత కథల ఎంపిక విషయంలో కాస్త నిర్లక్ష్యం వ్యవహరించిన కృతి శెట్టి వరుసగా డిజాస్టర్ లను మూటగట్టుకుంది.

అలా మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్ వంటి సినిమాలలో నటించి భారీ డిజాస్టర్ లను చవిచూసింది. ప్రస్తుతం ఈమె చేతిలో నాగచైతన్య కస్టడీ సినిమా మాత్రమే ఉంది.

ఈ సినిమా విజయం సాధిస్తే తప్ప ఈమెకు తెలుగులో అవకాశాలు రావని చెప్పడంలో సందేహం లేదు. ఇదిలా ఉండగా సినిమాలలో అవకాశాలు దక్కించుకోవడం కోసం డిజిటల్ వేదికగా వయ్యారాలు వలకబోస్తూ సోషల్ మీడియాలో మరింత పాపులారిటీ దక్కించుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోని వరుస గ్లామర్ ఫోటోషూట్లతో కుర్రాళ్ళ గుండెలను మాయ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

ఈ క్రమంలోని తాజాగా కృతి మోడ్రన్ డ్రెస్ లో యువతను ఆకట్టుకుంది .ఊరించే పెదవులతో మైండ్ బ్లోయింగ్ అనిపించేలా వయ్యారాలు వలకబోస్తోంది..ఈమె అందాలు చూసి యువత చెమటలు కక్కుతున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అగ్గి రాజేస్తున్నాయి. ఏది ఏమైనా బేబమ్మ బ్యూటీ కి తట్టుకోవడం కష్టమే అబ్బా అంటూ కామెంట్లు వెలువడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news