Kushi : “ఖుషి” టైటిల్ తో వచ్చేసిన విజయ్ దేవరకొండ, సమంత

-

ప్రస్తుతం విజయ్ దేవరకొండ, సమంత కాంబో లో VD11 పేరుతో ఒక మూవీ వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ గత నెలలో ప్రారంభమైంది. ఈ సినిమాకి దర్శకత్వం శివ నిర్వాణ వహిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

VD11 మూవీకి ప్రఖ్యాత యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ ఆన్-బోర్డ్‌లో ఉన్నారు. పీటర్ హెయిన్ మరియు దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రంలో విజయ్ నటించిన యాక్షన్ ఓరియెంటెడ్ విచిత్రమైన ఇంట్రడక్షన్ సీక్వెన్స్‌ను రూపొందిస్తున్నారు.

అయితే తాజాగా ఈ మూవీ నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. VD11 మూవీ టైటిల్‌ ను ఫిక్స్‌ చేయడమే కాకుండా.. మూవీ టైటిల్‌ ను అనౌన్స్‌ చేసింది చిత్ర బృందం. ఈ సినిమాకు “ఖుషి” అనే పవన్‌ కళ్యాణ్‌ టైటిల్‌ ను పెట్టారు. అలాగే.. విజయ్‌, సమంతల ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం. కాగా… ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్‌ 23వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news