జాతిరత్నాలు సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు కేవీ అనుదీప్. అంతకు ముందు దర్శకుడు నాగ్ అశ్విన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన అనుదీప్.. జాతిరత్నాలు సినిమాతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమా యూత్ ను బాగా ఆకట్టుకుంది.
ఇక ఈ సినిమా తర్వాత రీసెంట్ గా ప్రిన్స్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అనుదీప్. తమిళ్ హీరో శివకార్తికేయన్ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కూడా కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చింది. తెలుగు తమిళ్ భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా కూడా పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది. రొటీన్‌కి భిన్నంగా సరదా పంచ్‌లు వేస్తూ.. కడుపుబ్బా నవ్వించడం అనుదీప్ స్పెషాలిటీ. అలాంటి అనుదీప్, ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా తానే లేటెస్ట్ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు.
ఆ వ్యాధి పేరు హైలీ సెన్సీటీవ్ పర్సన్ (హెచ్‌ఎస్‌పీ). తన శరీరంలో చోటు చేసుకున్న కొన్ని మార్పుల వల్ల.. ఈ డిజార్డర్‌ని తాను గుర్తించానని అనుదీప్ తెలిపాడు. నిజానికి.. ప్రతి ఒక్కరిలోనూ ఈ డిజార్డర్ లక్షణాలు కామన్‌గానే ఉంటాయని, కానీ దాన్ని అర్థం చేసుకోలేరని పేర్కొన్నాడు. తనకు గ్లూటెన్ పడదని, కాఫీ తాగితే రెండ్రోజులపాటు నిద్ర పట్టదని చెప్పాడు. ఏదైనా పళ్ల రసం తాగితే.. తన మెదడు పనితీరు ఆగిపోతుందని, మైండ్ అంతా బ్లాక్ అవుతుందని అన్నాడు. ఆ సమయంలో తానేం చేస్తున్నానో అర్థం కాదన్నాడు.
అయితే.. ఈ డిజార్డర్ ఉన్న వారి సెన్సెస్ చాలా స్ట్రాంగ్‌గా పని చేస్తాయని చెప్పుకొచ్చాడు. కానీ.. ఈ వ్యాధి ఉన్నవారు చాలా త్వరగా అలసిపోతారని అనుదీప్ వెల్లడించాడు. తాను ఎక్కువ కాంతివంతమైన లైట్స్‌ని, అలాగే ఘాటైన వాసనలు చూసినా.. వాటి తీవ్రతను తట్టుకోలేదని అనుదీప్ పేర్కొన్నాడు. ఈ వ్యాధి శాస్త్రీయంగా నిరూపించబడలేదని, దీనిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయని అన్నాడు. ఈ వ్యాధి లక్షణాలున్నవారు.. ఎలాంటి ఆహారం తీసుకోవాలనే దాన్ని పరిశోధించి, ఆ ఆహారాల్నే తీసుకుంటున్నాని వివరించాడు. ఈ వ్యాధిపై తాను భవిష్యత్తులో తప్పకుండా ఒక సినిమా చేస్తానని, దాంతో కొందరైనా హీల్ అవుతాని తాను భావిస్తున్నానని అనుదీప్ చెప్పుకొచ్చాడు.